టీచర్స్ రోడ్లు ఎక్కాలా క్లాస్ రూమ్ లో ఉండి విద్యార్థులకు విద్యా బోధన చేయాలా

మన న్యూస్,ఎల్.బి.నగర్: టీచర్స్ యొక్క సమస్యలపై మాట్లాడే గొంతుక అసెంబ్లీ లో వినబడాలి,విజ్ఞత తో ఓటు హక్కు ను వినియోగించుకోవాలి,ప్రోగ్రెస్సివ్ రికగనైజడ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి,ఆర్జి,టి ఏ) అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎల్.బి.నగర్ నియోజకవర్గం మనసురాబాద్ డివిజన్ మల్లికార్జున నగర్ లోని కమ్యూనిటీ సెంటర్ లో ప్రోగ్రెస్సివ్ రికగనైజడ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్(పి,ఆర్జి, టి ఏ) రాష్ట్రస్థాయి మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం లో పి ఆర్ జి టి ఏ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు,గురుకుల టీచర్స్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకుల టీచర్స్ సమస్యల పరిష్కారం,సంక్షేమం కోసం ఈ పి ఆర్ జి టి ఏ ఏర్పడిందని, రాష్ట్రవ్యాప్తంగా గురుకుల టీచర్స్ అందరూ ఇందులో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ప్రతినెల రెండవ శనివారం సెలవు దినంగా ప్రకటించాలని, 010 ద్వారా వేతనం,సీసీఎల్ మంజూరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులైనటువంటి పి శ్రీపాల్ రెడ్డి,వంగ మహేందర్ రెడ్డి లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి ఆర్ జి టి ఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ అశోక్,జెల్ శ్రీనివాస చారీ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సామూహిక మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి

    మన ధ్యాస, నిజాంసాగర్, (జుక్కల్) ప్రజల సౌకర్యార్థం కోసం 15వ ఆర్థిక సంఘం నిధులతో కలిపి ఎస్ బిఎం కింద 5 లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపడుతున్నామని. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.పెద్ద కోడప్ గల్…

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

    పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

    అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

    అక్రమ మైనింగ్ తరలింపు పై పోలీసులకు ఫిర్యాదు..

    మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

    మహిళలకు మెరుగైన వైద్య సేవల కొరకే ఈ యోజన…

    శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

    శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై చర్యలకు డిమాండ్. బంజారా సంఘం పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు.

    ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

    ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ కృష్ణ మూర్తి పై తీవ్ర ఆరోపణలు: సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్

    ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్

    ఉరవకొండలో జ్యోతి అక్రమ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎఫ్‌డీఎస్ డిమాండ్