మన న్యూస్,తిరుపతి: తిరుపతి వైకుంఠ ఏకాదశి సందర్బంగా వికృతమల
శ్రీ సంతాన సంపద వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో ఉదయం నుండే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు ప్రత్యేక ఆకర్షణగా విశేషమైన పూల అలంకరణ భక్తులను ఆకట్టుకుంది భక్తులందరు స్వామి వారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేసుకొని స్వామి వారి ఆశీస్సులు పొందారు
హైదరాబాద్ నుండి వచ్చిన కచ్చేరి బృందం తో అన్నమయ్య కీర్తనలు త్యాగరాజ కీర్తనలు భజనల లో భక్తులు పాల్గొన్నారు వచ్చిన భక్తులందరికీ ఆలయ చైర్మన్ డా.పసుపులేటి హరిప్రసాద్ ప్రసాదాల పంపిణి చేసారు.
సుమారు 5000 మంది భక్తులు స్వామి వారి దర్సనం చేసుకున్నారు
ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు కలిసి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం మరియు రాత్రి భక్తులకు అన్నదానం చేసారు
ఆలయ చైర్మన్ డా.పసుపులేటి హరిప్రసాద్ సోదరులు పసుపులేటి వెంకట ప్రసాద్,పసుపులేటి శివ ప్రసాద్ కుటుంబ సమేతం గా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.చుట్టు పక్కన గ్రామాలు ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *