

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు: ప్రత్తిపాడులోలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం శాఖ సర్వసభ్య సమావేశం సాయిశుభ రెసిడెన్సిలో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రత్తిపాడు దేవర్ష్ హాస్పటల్ అధినేత డాక్టర్ అంజి నాయక్, డాక్టర్ విజయ విచ్చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంజి నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న కిడ్నీలో రాళ్లు సమస్యలు వాటి నివారణ మార్గాల గురించి తెలిపారు. డాక్టర్ విజయ మాట్లాడుతూ స్త్రీలలో సంభవించే పీసీఓడీ సమస్యను వాటి నివారణ మార్గాల గురించి ఆమె తెలిపారు.బేసిక్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వివి కృష్ణారావు మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల చట్టబద్ధత గురించి ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రామలక్ష్మణరావు, సిరికి శ్రీను,ఆకువీటి శ్రీనివాస్, వై మూర్తి, ఆర్ శ్యాం కుమార్,లక్ష్మీనాచారి, ఏలేశ్వరం యూనిట్ అధ్యక్షులు బర్రె నరసింహమూర్తి,చిట్టిబాబు, చందక దుర్గా శంకర్,ఎం జనార్ధన్, పెబ్బిలి అప్పారావు, ఏ తమ్మారావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు జె సతీష్, కే శ్రీను, ఎస్ నాగేశ్వరరావు, మరియు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.