

మనన్యూస్:ఏలేశ్వరం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల9వ తరగతి విద్యార్థులకు ఒకేషనల్ ఆటోమోటివ్ ట్రేడ్ విభాగం లో ఒకేషనల్ ట్రైనర్ బి.మహేష్ ఆధ్వర్యంలో హోండా షోరూంలో ఇండస్ట్రియల్ సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వెన్నా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులకు పారిశ్రామిక రంగంలో మెలకువలు నేర్చుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఈకార్యక్రమంలో ఎం.చిన్నబాబు,మువ్వల లోవ ప్రసాద్,దలె వెంకట రమణ,డి. శివాజీ తదితరులు పాల్గొన్నారు.