*కలిగిరి, నవంబర్ 5 (మన ధ్యాస RC ఇన్చార్జి నాగరాజు):*

కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి డబ్బుగుంట మదన్మోహన్ తన సమీప ప్రత్యర్థిపై 651 ఓట్ల భారీ మెజారిటీ తో విజయం సాధించారు.ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుండి గ్రామంలో టీడీపీకి మంచి ఆదరణ కనిపించింది. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తామని మదన్మోహన్ ఇచ్చిన హామీలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. యువత, మహిళలు, పెద్దలు అందరూ కలిసి ఆయన విజయం కోసం కృషి చేశారు.ఎన్నికల ఫలితాలు వెలువడగానే గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. విజయం సాధించిన మదన్మోహన్ కు పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు, అభిమానులు ఘనంగా అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ *డబ్బుగుంట మదన్మోహన్* మాట్లాడుతూ. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సారాధ్యంలో ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ కృష్ణారెడ్డి పాలెం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు. అదేవిదంగా తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోతానని, ప్రతి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.గ్రామంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తానని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *