

మన న్యూస్:సరూర్నగర్.స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ న్యూ హోప్ అసోసిఏషన్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ మొక్క మాస్టర్ వాలంటీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం సరూర్ నగర్ లోని రంగారెడ్డి జిల్లా సంక్షేము అధికారి కార్యాలయంలోని మహిళా సాధికార కేంద్రం నందు నిర్వహించడం జరిగింది.ఇందులో ఎస్.ఎల్ సి.ఏ.డైరెక్టర్ కోమలి మాట్లాడుతూ, సమాజంలోని యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా మాష్టర్ వాలంటీర్లు కృషి చేయాలని, త్రాగుడుకు భానిసలైన వారిని ఓ అడిక్షన్ సెంటర్లలో చేర్పించి వారు మాదకద్రవ్య వ్యసనం నుండి బయట పడేలా చేయాలని పిలుపు నిచ్చారు.ఇందులో జిల్లా సంక్షేమ అధికారిణి సిహెచ్ సంధ్యారాణి పాల్గోని, మాష్టర్ వాలంటీర్లు పాత్ర, ప్రాముఖ్యత గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీశైలం,సైకాలజిస్ట్ శ్రీనివాస్, ట్రైనర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.