​రేణిగుంట , నవంబర్ 19..

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ ( ఏ సి టి సి ) నుండి కళ్యాణి కాసిమల ‘బ్యాచిలర్ ఆఫ్ క్రిస్టియన్ స్టడీస్’ (బాచిలర్ అఫ్ క్రిస్టియన్ స్టడీస్ ) డిగ్రీ పట్టాను అందుకున్నారు.
​గురువారం (నవంబర్ 19) సాయంత్రం 4:00 గంటలకు హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్, గాంధీ నగర్‌లోని ఏసీటీసీ కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగిన స్నాతకోత్సవ (కాన్వొకేషన్) వేడుకల్లో కళాశాల యాజమాన్యం చేతుల మీదుగా ఆమె ఈ పట్టాను స్వీకరించారు.
​ఈ సందర్భంగా రెవరెండ్ సతీష్ విజయ్ కుమార్, రెవరెండ్ అనురాగ్, రెవరెండ్ రవీంద్ర మోసెస్ మరియు రెవరెండ్ అదృష్ట దీపక్ కళ్యాణి కాసిమల కి తమ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. దేవుని కృపతో ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆధ్యాత్మిక మరియు దైవ సేవా రంగంలో మరింత బలంగా వాడబడాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *