502 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై విజయం జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ
కలిగిరి: నవంబర్ 8 మన ద్యాస ప్రతినిధి శ్రీకాంత్
కలిగిరి మండల జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి మెట్టుకూరి శిరీషా రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలేపాటి జయమ్మపై 502 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.కలిగిరి మండలంలో మొత్తం 38,173 మంది ఓటర్లు ఉండగా, 27,842 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 501 ఓట్లు చెల్లనివిగా ప్రకటించగా, 27,167 ఓట్లు చెల్లుబాటయ్యాయి. మరో 174 ఓట్లు నోటాకు నమోదయ్యాయి.అభ్యర్థుల వారీగా ఓట్ల వివరాలు:- మెట్టుకూరి శిరీషా రెడ్డి (టీడీపీ) – 13,765 ఓట్లు.- మాలేపాటి జయమ్మ (వైఎస్సార్‌సీపీ) – 13,263 ఓట్లు.- కాకుటూరు పుష్పాంజలి (బీజేపీ) – 121 ఓట్లు.- పర్ల బాబులు (ఇండిపెండెంట్) – 18 ఓట్లు.దీంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జయమ్మపై మెట్టుకూరి శిరీషా రెడ్డి 502 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.ఈ విజయంతో కలిగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఇప్పటికే మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాలను గెలుచుకున్న కూటమి, తాజాగా జడ్పీటీసీ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవడంతో టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.జడ్పీటీసీ విజయంతో కలిగిరి మండలంలో టీడీపీ కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
