కలిగిరి నవంబర్ 3 మన ద్యాస ప్రతినిది శ్రీకాంత్ కుట్టుబోయిన
కావలి –సీతారామపురం నేషనల్ హైవే(167GB)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సర్వేపల్లి బ్రహ్మయ్య (42) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన కలిగిరి మండలంలోని బొమ్మరాజు చెరువు గ్రామం సమీపంలో చోటుచేసుకుంది.అందిన వివరాల ప్రకారం.. వింజమూరు మండలం గొట్టిగుండాల గ్రామం నుంచి కలిగిరి వైపు వస్తుండగా, మార్గమధ్యంలో రోడ్డుపై ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బ్రహ్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బ్రహ్మయ్య కలిగిరిలో కొయ్య పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై కలిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
