రాయలసీమ వ్యాప్తంగా ‘అమరా ఫస్ట్ రెస్పాన్స్’ విస్తరణ…

​తిరుపతి, అక్టోబర్ 17.

ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా తిరుపతి అమరా హాస్పిటల్‌కు చెందిన అమరా ట్రామా & ఎమర్జెన్సీ సిస్టమ్ ( ఏ టి ఈ ఎస్ ) తమ ప్రాణరక్షణ శిక్షణా కార్యక్రమం ‘అమరా ఫస్ట్ రెస్పాన్స్ ( ఏ ఎఫ్ ఆర్ )’ను రాయలసీమ అంతటా విస్తరించింది. ప్రస్తుతం వారానికి 2-3 శిక్షణా తరగతులు నిర్వహిస్తూ సాధారణ ప్రజలు, డ్రైవర్లు, సిబ్బందికి సిపిర్ , రక్తస్రావం అరికట్టడం, ప్రథమ చికిత్సపై శిక్షణ ఇస్తున్నారు.
​ఈ సందర్భంగా అమరా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌరినేని మాట్లాడుతూ, తీవ్ర గాయాలైనప్పుడు సకాలంలో స్పందించడం రోగి ప్రాణాలను కాపాడుతుందన్నారు. ఏ టి ఈ ఎస్ డైరెక్టర్ డాక్టర్ తమోరిష్ కోలే మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో తొలి కొన్ని నిమిషాలు ఎంతో కీలకమని, ప్రథమ చికిత్స తెలిసిన వ్యక్తుల నెట్‌వర్క్‌ను పెంచుతున్నామని తెలిపారు. ట్రామా ఎమర్జెన్సీ విభాగధిపతి డాక్టర్ సురేష్ ఖన్నా మాట్లాడుతూ, వైద్య బృందం వచ్చే వరకు ప్రాథమిక చికిత్స అందించడం వల్ల ప్రాణాపాయం తగ్గుతుందని పేర్కొన్నారు.
​అయితే, ప్రమాదం జరిగిన వెంటనే ఏ చికిత్స అందించాలి, ఆసుపత్రికి తరలించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక సాధారణ ప్రజలు తరచూ అయోమయానికి, కన్ఫ్యూజన్‌కు గురవుతుంటారని వైద్యులు అభిప్రాయపడ్డారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల చేసే చిన్న చిన్న పొరపాట్లు రోగి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తాయని, అందుకే ఏ ఎఫ్ ఆర్ శిక్షణ ద్వారా ప్రజల్లో ఈ గందరగోళాన్ని తొలగించి, వారిలో ధైర్యం మరియు సరైన అవగాహన నింపుతున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రాథమిక ప్రథమ చికిత్స నేర్చుకుని సురక్షితమైన రాయలసీమ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆసుపత్రి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *