గాజువాక మన ధ్యాస ప్రతినిధి అక్టోబర్ 17: వైయస్సార్సీపి రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో జి.వి.ఎమ్.సి ఎన్నికలలో భాగంగా రెండో విడత అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా88 వ వార్డు వైయస్సార్సీపి కార్పొరేటర్ అభ్యర్థిగా గోడబ మనోజ్ కుమార్ ను అధిష్టానం ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి,వైయస్సార్ సిపి రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు కే.కే రాజు పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ అధిష్టాన పెద్దలు యువ నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని 88 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా గెలుపొంది బహుమతిగా అందజేస్తాను.గాజువాక ప్రాంత ప్రజలు విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో పాటు,88వ వార్డులో ప్రజలు అనేక విధాలుగా సమస్యలతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.ప్రజలు నా యందు ఆదరాభిమానాలు చూపిస్తారని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి నాయకులు,కార్యకర్తలు అభిమానులు,కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలియజేశారు.