నిజాంసాగర్‌, ( మనధ్యాస): అక్టోబర్ 17,రైతులు పండించిన ధాన్యాన్ని సులభంగా విక్రయించేందుకు వీలుగా నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సింగ్ రావు పల్లి, మర్పల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌ , అచ్చంపేట సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కాంటాక్ పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి తూకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ..ధాన్యం విక్రయించే సమయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని నాయకులు సూచించారు. రైతులకు సమీప గ్రామాల్లోనే కొనుగోలు సౌకర్యం అందుబాటులోకి రావడంతో ధాన్యం విక్రయ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ, కొనుగోళ్లు సజావుగా జరిగేలా సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో: నిజాంసాగర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రజా పండారి, సర్పంచ్ మోహన్, నాయకులు అజయ్ రెడ్డి ,చాకలి సాయిలు, సొసైటీ సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ రైతులు తదితరులు ఉన్నారు,

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *