మన ద్యాస, బుచ్చిరెడ్డిపాలెం, అక్టోబర్ 16 : నెల్లూరు జిల్లా,బుచ్చిరెడ్డిపాలెం పెనుబల్లి గ్రామంలో, పెనుబల్లి తిప్ప (కొండపై) శ్రీ సుందరేశ్వర స్వామి వారి నూతన బింబ ( శివలింగం )ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ సుందరేశ్వరస్వామి లింగ ప్రతిష్ట లలిత మహేశ్వరి ఆశ్రమం, శ్రీ లలితా భరద్వాజ దత్త పీఠం పీఠాధిపతులు, పూర్వ గురువులు శ్రీ రామాయణం మహేష్ స్వామీజీ ఆధ్వర్యంలో వేదమంత్రాలతో భక్తుల నడుమ ఈ కార్యక్రమం కన్నుల పండుగా జరిగింది. ఏ. శ్రీనివాసులు మాట్లాడుతూ…. పెనుపల్లి తిప్పపై శ్రీ సుందరేశ్వర స్వామి లింగ ప్రతిష్ట జరగడం ఆనందంగా ఉంది అని తెలిపారు. తిప్పపై మొక్కలు నాటి ఈ ప్రదేశం సుందరం వనంగా తీర్చేదిద్దాలని ఆకాంక్షించారు. రోశి రెడ్డి మాట్లాడుతూ….. శివయ్య లింగ ప్రతిష్ట విచ్చేసిన మహేష్ స్వామీజీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొండ పవిత్ర ప్రదేశంగా అవ్వాలని కోరారు.మహేష్ స్వామీజీ మాట్లాడుతూ…. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం సమీపంలో కొండపై శివయ్య లింగం ప్రతిష్ట నా ద్వారా జరగడం అదృష్టంగా భావిస్తున్నాను తెలిపారు. ఈ పెనుబల్లి తిప్ప పవిత్ర ప్రదేశంగా భక్తులతో కలకలలాడని కోరారు. అనంతరం భక్తులకు భోజన సదుపాయం కలగజేశారు. ఈ కార్యక్రమంలో విజయ కృష్ణ, టి. నారాయణ, చింతం శ్రీనివాసు లరెడ్డి, రఘురామయ్య, డి.శ్రీనివాసులు,ఎర్రి రోశి రెడ్డి, ఏ శ్రీనివాసులు తదితరులు భక్తులు పాల్గొన్నారు.






