మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీగొల్లప్రోలు

మన న్యూస్:కాకినాడ చేపల వేటకు వెళ్లి అల్పపీడన కల్లోలిత సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ సంస్థల సహకారంతో బుధవారం సురక్షితంగా తీరానికి చేర్చామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఈ విధంగా ఆయన తెలియజేశారు. ఈ నెల 23వ తేదీన కాకినాడ , పర్లోపేటకు చెందిన నలుగురు మత్స్యకారులు వాడమొదలు ధర్మరాజు, వాడమొదలు పెంటయ్య, మల్లాడి నాని, మల్లాడి సతీష్ కలిసి పడవలో చేపల వేట నిమిత్తం బోటులో బైరవపాలెం వైపు సముద్రంలోకి వెళ్లారు. సముద్రంలో 25 నాటికన్ మైళ్ల దూరంలో వేటసాగిస్తుండగా, అల్పపీడనం కారణంగా పెనుగాలులతో కల్లోలితమైన సముద్ర అలల్లో చిక్కుకుని తీరాని రాలేక, బైరవపాలెం సమీపంలోని రిలయన్స్ రిగ్ కు చెందిన పోల్ ఒకదానికి తమ పడవను తాళ్లతో కట్టి, సహాయం కోసం మత్స్యశాఖ అధికారులను ఈ నెల 24వ తేదీన ఫోన్ ద్వారా అభ్యర్థించారు. జిల్లా కలెక్టర్ సూచనలతో మత్స్యశాఖ అధికారులు సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సహాయాన్ని కోరారు. కోస్ట్ గార్డ్, ఓఎన్జిసీ రక్షణ బృందాలు సముద్రంలో చిక్కుకున్న నలుగురు మత్స్యకారులను రక్షించి, బోటుతో సహా సురక్షితంగా బుధవారం ఒడ్డుకు చేర్చాయి. కోరిన వెంటనే రక్షణ ఆపరేషన్ చేపట్టి ఎటువంటి అపాయం లేకుండా మత్స్యకారులను కాపాడిన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఓఎన్జీసి సంస్థలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడనం తొలగిపోయే వరకూ మత్స్యకారులెవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని, వాతావరణ శాఖ, మత్స్యశాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

  • Related Posts

    బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం ఎస్పీగా హర్షవర్ధన్ రాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా విధులు నిర్వహించిన ఎస్పీ దామోదర్ విజయనగరం జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తిరుపతి నుంచి ఎస్పీ…

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ‎తవణంపల్లె మన ధ్యాస సెప్టెంబర్-13‎పార్వతీపురం మన్యం జిల్లా కొత్త కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వస్థలం అయిన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలోని వెంగంపల్లెలో ఉత్సాహం వెల్లివిరిసింది. గ్రామంలో చిన్నా – పెద్దా అందరూ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!

    • By NAGARAJU
    • September 14, 2025
    • 2 views
    ఒకే రోజు క‌లెక్ట‌ర్లుగా భార్యాభ‌ర్త‌లు…!!!!

    వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!

    • By NAGARAJU
    • September 14, 2025
    • 4 views
    వింజమూరు పట్టణంలో మాసిలమణి చిన్నపిల్లల ప్రైవేట్ హాస్పిటల్‌కి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శన..!

    బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

    • By JALAIAH
    • September 14, 2025
    • 4 views
    బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నక్కల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ: వెంగంపల్లెలో సంబరాలు – కుటుంబ సభ్యులు, గ్రామస్తుల హర్షం

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    ముద్రగడ ను కలిసిన జ్యోతుల చంటిబాబు.

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..

    కొత్తిం బాలకృష్ణను పరామర్శించిన ముద్రగడ గిరి బాబు..