మన ధ్యాస ప్రతినిధి గాజువాక అక్టోబర్ 11 : శ్రీ సాయి వంశీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త గాజువాక జంక్షన్‌లో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి పూజా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారి తొలి పూజా కార్యక్రమాలను గాజువాక బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి అండిబోయిన లక్ష్మి, అండిబోయిన అప్పారావు దంపతుల చేతుల మీదుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీను మాట్లాడుతూ శ్రీ సాయి వంశీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అభినందనీయమని అన్నారు. అండిబోయిన లక్ష్మి,అప్పారావు దంపతులు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ బడుగు,బలహీన వర్గాలకు సేవలందిస్తున్నారని కొనియాడారు.సేవాభావం కలిగిన దంపతులతో అమ్మవారి తొలి పూజ నిర్వహించడం సంతోషకరమని,అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా అండిబోయిన లక్ష్మి, అప్పారావు దంపతులు మాట్లాడుతూ శ్రీ సాయి వంశీకృష్ణ యూత్ అసోసియేషన్ యువత ప్రతి సంవత్సరం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ,అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ,అమ్మవారి మాలలు ధరించి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.ఇంతటి పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములుగా తమను ప్రతి సంవత్సరం తొలి పూజకు ఆహ్వానిస్తూ గౌరవం, అభిమానం చూపుతున్న యూత్ అసోసియేషన్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో యువత సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సింహాచలం, ముత్యాలరావు,నడిగట్ల రాజు,మంగరాజు సురేష్,తేజ, రవి,త్రినాధ్,లక్ష్మి,పైడికొండ జయ,చిన్ని తదితరులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు,యువకులు,యూత్ అసోసియేషన్ సభ్యులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *