• జిల్లా బీసీవై పార్టీ కో కన్వీనర్ అంజూరి దీపక్..

విశాఖ జిల్లా మన ధ్యాస ప్రతినిధి సెప్టెంబర్ 24:పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 58వ ఎదురువాని పాలెం గ్రామంలో శ్రీమతి సాగి జగదీశ్వరి ఆధ్వర్యంలో అత్యధిక సంఖ్యలో పార్టీలోకి సభ్యులు చేరిక అయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ జిల్లా బీసీవై పార్టీ కో – కన్వీనర్అంజూరి దీపక్ అధ్యక్షతన పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా భారీ వర్షాలు కూడా లెక్క చేయకుండా 50 మంది కొత్తగా పార్టీలో జాయిన్ అవడం జరిగింది.ఈ సందర్భంగా అంజూరీ దీపక్ మాట్లాడుతూ ఎస్.సి,ఎస్.టి,బి.సి, మైనారిటీ మరియు అగ్ర వర్ణ పేదలకు అండగా నిలిచిన పార్టీ బిసీవై పార్టీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అది బిసీవై పార్టీతోనే సాద్యం అవుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో సాగి జగదీశ్వరి58(83) వార్డ్ బీసీవై పార్టీ మహిళా విభాగం కన్వీనర్ గా నియమిస్తూ నియమాక పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమానికి బిసీవై పార్టీ రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ అనుపమ యాదవ్,స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ అల్లు రమణ యాదవ్,64 వార్డు పరమేష్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *