- 35 వార్డ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అలుపన కనకా రెడ్డి….
విశాఖపట్నం మన ద్యాస ప్రతినిధి సెప్టెంబర్ 26: పూర్ణ మార్కెట్ 35వ వార్డు పండా వీధి రెడ్డీస్ లైన్ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నప్రసాదం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా35వవార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అలుపన కనకా రెడ్డి పాల్గొన్నారు యూత్ అధ్యక్షులు వరసిద్ధి వినాయకుడి దర్శనం తీర్థప్రసాదాలు స్వీకరించి తదనంతరం అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం జరిగింది.ఈ సందర్భంగా 35 వార్డ్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు అలుపన కనకా రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క పండావీధిలో ప్రతి ఏటా రెడ్డీస్ లైన్ బాయ్స్ ఆధ్వర్యంలో5000 మంది భక్తులకు అన్నసంతర్పణ నిర్వహిస్తున్నారు ఈ యొక్క సంఘం సభ్యులకు ఆ వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే 35వ వార్డు ప్రజల మీద కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు.నాయన కనకారెడ్డి,నాయన బుజ్జిరెడ్డి,జీరుఇంజిరెడ్డి,బోరా వినోద్ కుమార్ రెడ్డి అలుపనహరికుమార్ రెడ్డి,నాయనశ్రీనివాస్ రెడ్డి. నాయనవెంకీరెడ్డి,నాయన మహేష్ రెడ్డి,బండి రాజశేఖర్ రెడ్డి. మునకాల శివారెడ్డి,అలుపన రామిరెడ్డి,వైయస్సార్సీపి అభిమానులు కార్యకర్తలు,యూత్ కమిటీ సభ్యులు పొర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.