నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్‌ 25 (మన ధ్యాస): గణేష్‌ నిమజ్జనం సందర్భంగా నిషేధిత డీజేను వినియోగించిన ఘటనపై మొహమ్మద్‌నగర్‌ మండలం గిర్నితాండాలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేను ఏర్పాటు చేసిన గణేష్‌ మండప నిర్వాహకులతో పాటు డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా డీజే వినియోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకుని డీజేను స్వాధీనం చేసుకున్నారు. గణేష్‌ నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
ఈ సందర్భంగా ఎస్సై శివకుమార్‌ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించి నిషేధిత డీజేలను వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు, గణేష్‌ మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *