- 87 వార్డు ఇంచార్జ్,జిల్లా ఉపాధ్యక్షులు కోమటి శ్రీనివాస రావు…

మన ధ్యాస ప్రతినిధి గాజువాక సెప్టెంబర్ 18: 87 వ వార్డు కనితి ఏకలవ్య – II వీధిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.ఏకలవ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన 87 వ వార్డు ఇంచార్జ్ జిల్లా ఉపాధ్యక్షులు కమిటీ శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. ఏకలవ్య సంక్షేమ సంఘం సభ్యులు వినాయకుని ప్రతిమ దగ్గరకు తీసుకుని వెళ్లి ముఖ్యఅతిథిలను సాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది. తదనంతరం అన్న సమారాధన కార్యక్రమం కోమటి శ్రీనివాస రావు దంపతులు చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోమటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విగ్నేశ్వరుడి కృపతో యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు రావాలని కోరుకొన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.