మన ధ్యాస,మక్తల్: వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ( ఇంజనీర్స్ డే )సందర్బంగా స్థానిక మక్తల్ పట్టణం లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు లోకల్ ఇంజనీర్స్ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వాసవి క్లబ్ పెద్దలు మాట్లాడుతూ,వాసవి క్లబ్ ఇంటర్ నేషనల్ వారి ఆదేశాలతో మక్తల్ వాసవి క్లబ్ వారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నాడు ఇంజనీయార్లకు, సివిల్ ఇంజనీయర్లకు, సన్మానం చేయడం అనేది ఒక గౌరవంగా భావించాలని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వాసవి క్లబ్ జిల్లా వి 108 ఏ జాయింట్ ట్రెజరర్ మనసాని నాగరాజు,మాజీ డిప్యుటీ గవర్నర్ కల్వ శ్రీనివాస్,మాజీ కార్యదర్శి బిలకంటి రఘునాథ్,వాసవి సభ్యులు బిలకంటి జగదీష్,మాజీ అధ్యక్షులు మనసాని రంజిత్,గుగ్గిళ్ల రవి కుమార్,వాసవి క్లబ్ అధ్యక్షులు మేడిశెట్టి హరికృష్ణ,ప్రధాన కార్యదర్శి కొత్త ఆంజనేయులు,కోశాధికారి తాళంపల్లి పవన్ కుమార్,లోకల్ ఇంజనియర్లు,సివిల్ ఇంజనీయర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *