మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని పాకల గ్రామంలో ప్రభుత్వ రాజముద్ర తో ఉన్నటువంటి పాస్ పుస్తకాలను రైతులకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరేంద్ర స్వామి రైతులకు అందజేశారు
పారదర్శక పాలన కూటమి ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యం గా రాష్ట్రం లో రైతాంగానికి పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీ చేపట్టడం జరిగింది అన్నారు ప్రభుత్వ దస్త్రాల పై పోలాల హద్దు రాళ్లపై రాజకీయ నాయకుల చిహ్నాలు వేయించుకొని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర తో అధునాతన సాకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైత్వారి ఖాతా లతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతు భరోసా కి ప్రాధాన్యత ఇస్తుందని ఈ ప్రభుత్వాన్ని పరిరక్షించుకునే బాధ్యత రైతులు ప్రజలపై ఉందని మంత్రి డోలా పిలుపు ఇచ్చారు. ముందుగా ఆయన సింగరాయకొండ మండల గ్రామాల రైతులకు పంపిణీకి సిద్ధం చేసిన రైతు వారి పట్టా దారు పాసు పుస్తకాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.