విశాఖపట్నం మన ధ్యాస ప్రతినిధి ఆగస్టు 17: జీవీఎంసీ పార్క్ దగ్గర్లో గల గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన దీక్షలలో తుట్టా నూక రాజు,ఉరుకూటి రాజు,ఆర్ కె ఎస్ వి కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన నాయకత్వం మాట్లాడుతూ అప్కాస్ వర్కర్స్ డెత్&రిటైర్మెంట్ పోస్ట్లు భర్తీ చెయ్యాలని, మున్సిపల్ కార్మికుల ఉపాధి దెబ్బతీసే 673,975 జీవోల్ని రద్దు చేయాలని,వివిధ విభాగాలలో జివియంసి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకి 12వ పిఆర్సి ప్రకటించి పర్మనెంట్ చేయాలని,లేదా సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని,జివియంసి లో పెండింగ్ ఉన్న కార్మిక సమస్యలు పరిష్కారానికై కార్పొరేషన్లలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్,కార్మికులకు గత 3 ఏళ్లుగా జీతాలు పెరగకపోవడం,అధికారుల జాప్యం వల్ల తీవ్ర నిరసనకు కార్మికులు గురవుతున్నారు.పెరిగిన నిత్యవసర ధరలతో కార్మికుల బ్రతకడం కష్టంగా మారింది అందువల్ల కాంట్రాక్టుఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వం,అధికారులు తక్షణమే స్పందించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని గత మూడు రోజులుగా ఉమ్మడి విశాఖ నియోజకవర్గం ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.నేటి నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు చర్చించి కార్మికులకు న్యాయం చేయాలని జివియంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు నేతలు కోరారు.గొలగాని అప్పారావు, వి.కృష్ణారావు,ముద్దాడ ప్రసాద్,జే.ఆర్. నాయుడు,నక్క నాగరాజు,ఇ.ఆదినారాయణ,గణేష్,అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.