మన ధ్యాస,కర్నూలు, ఆగస్టు 15 : అనుభవ్ అగర్వాల్ గ్రూప్‌ నందు భాగమైన అగస్త్య ఎనర్జీ లిమిటెడ్, కర్నూలు ఓర్వకల్ పారిశ్రామిక వాడలో సుమారు రూ.7,800 కోట్ల వ్యయంతో సమీకృత 12 GW ఇంగాట్ మరియు వేఫర్ గ్రీన్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టు స్థాపించనున్నట్లు ఈరోజు ప్రకటించినది. ఈ ప్రాజెక్టు సంస్థ ప్రస్తుత సోలార్ సెల్ మరియు మాడ్యూల్ తయారీ సామర్థ్యాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టు వలన 12 GW సమీకృత ఇంగాట్ మరియు వేఫర్ ఉత్పాద ఉత్పాదనలతో అగస్త్య ఎనర్జీ దేశీయ ఉత్పాదక సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది మరియు భారతదేశ సౌర ఉత్పాదక రంగంలో మరింత దేశీయ ఉత్పాదనకు అవకాశం కలుగుతుంది. అంతేకాక ఈ ప్రాజెక్టు స్థాపన వలన తదుపరి దశకు నాంది పలుకటమే కాక 3,500కు పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఫోటోవోల్టాయిక్ తయారీలో పోటీ పడే ప్రాజెక్టు స్థాపించాలనే అగస్త్య ఎనర్జీ లక్ష్యం నెరవేరుతుంది.ఈ ప్రాజెక్టు సందర్భంగా శ్రీ అనుభవ్ అగర్వాల్, ఛైర్మన్ అనుభవ్ అగర్వాల్ గ్రూప్ (AAG) మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ధికి దోహదపడే ప్రాజక్టుల స్థాపన మరియు ఇంధన భద్రత దిశగా భారతదేశ సాధికారికతను పెంపొందించాలి అనే లక్ష్యం పైన మేము దృష్టి సారిస్తాము. అగస్త్య ఎనర్జీలో రూ.7,800 కోట్ల పెట్టుబడి, భారతదేశ ఇంధన పరివర్తనపై మా విశ్వాసాన్ని పెంచటమే కాక ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ సామర్థ్యతలను పటిష్టం చేయాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడమే కాక , దిగుమతులను తగ్గించుటకు ఒక పటిష్టమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం చాలా కీలకమని విశ్వసిస్తున్నాము.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ తయారీ మరియు పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించటమే కాక అందుకు అవసరమైన మద్దతును అందిస్తున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ గౌరవ మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ మరియు గౌరవ పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖల మంత్రి శ్రీ టి. జి. భరత్ గార్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. పారిశ్రామిక వృద్ధి కొరకు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించటం మరియు భారతదేశ స్వచ్ఛ ఇంధన భవిష్యత్తు కొరకు నిర్మాణాత్మకమైన ప్రాజెక్టులను రాష్ట్రంలో స్థాపించటంలో వారి పాలన నాయకత్వం, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం కీలక పాత్ర పోషించటం గర్వకారణం. అగస్త్య ఎనర్జీ లిమిటెడ్ వారి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు సందర్భంగా శ్రీ పియూష్ బిచోరియా, డైరెక్టర్ అగస్త్య ఎనర్జీ వారు మాట్లాడుతూ, “ఇంగాట్ మరియు వేఫర్ తయారీ రంగంలో మా విస్తరణ, సమీకృత సౌర ఉత్పాదక వ్యూహంలో ఒక కీలకమైన ఉన్నత శిఖరంగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టు సోలార్ సెల్ మరియు మాడ్యూల్ సామర్థ్యాలకు తోడ్పడుతూ మరింత బలోపేతం చేస్తుంది. ఇది సౌర పర్యావరణ వ్యవస్థలో మా స్థానాన్ని పెంచుతుంది, దేశీయంగా అధిక ప్రాధాన్యత కలిగి భారతదేశం యొక్క పెరుగుతున్న పునరుత్పాదక ఇంధన అవసరాలకు మద్దతు అందించాలి పైన దృష్టి సారించి ‘పవరింగ్ ది ఏజ్ ఆఫ్ ఇండియా’కు ఇది మా వంతు సహకారం.ప్రాజెక్టు ప్రతిపాదన అనంతరం అగస్త్య ఎనర్జీ CEO శ్రీ బెర్నార్డ్ రాక్ మాట్లాడుతూ, “ప్రపంచ ఇంధన పరివర్తన, పటిష్టమైన, విస్తరించగల మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల సౌర ఉత్పాదక రంగాలకు బలమైన అవసరాన్ని ఈ ప్రాజెక్టు సృష్టిస్తోంది. ఈ విస్తరణ ఇంగాట్‌లు, వేఫర్‌లు, సెల్‌లు మరియు మాడ్యూల్స్‌లో అగస్త్య ఎనర్జీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. స్వచ్ఛ ఇంధన ఉత్పాదక రంగంలో భారతదేశాన్ని ఒక ప్రముఖ కేంద్రంగా స్థాపించే దిశగా ఇది ఒక కీలకమైన మలుపు. ఈ సమీకృత ప్రాజెక్టు ఇంగట్, వేఫర్, సెల్ మరియు మాడ్యూల్ తయారీని ఒకే వేదిక పైకి తెస్తుంది. ఇది ఫోటోవోల్టాయిక్ యొక్క వాల్యూ చెయిన్ అప్‌స్ట్రీమ్ మరియు డౌన్‌స్ట్రీమ్ విభాగాలలో అధిక దేశీయ విలువలు చేకూర్చటమే కాక తయారీ సామర్థ్యం మరియు లోతైన ఏకీకరణ సాధ్యమవుతుంది. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE), సోలార్ పీవీ మాడ్యూల్స్, సెల్స్ మరియు వేఫర్‌ల కోసం ALMM జాబితా IIIతో సహా ALMM ఫ్రేమ్‌వర్క్‌ను క్రమంగా బలోపేతం చేస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన జరిగినది. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE), సోలార్ పీవీ మాడ్యూల్స్, సెల్స్ మరియు వేఫర్‌ల కోసం ALMM జాబితా IIIతో సహా ALMM ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ లకు అనుగుణంగా దేశం యొక్క పునరుత్పాదక ఇంధనం, ఇంధన భద్రత మరియు దేశీయ సౌర తయారీ పర్యావరణ వ్యవస్థ లక్ష్యాలకు మద్దతు అందిస్తుంది.About Agastya Energy Group:Agastya Energy Group is a renewable energy company focused on building integrated capabilities across the solar photovoltaic value chain. Headquartered in New Delhi & a part of the AAG, the company is focused on developing scalable, technology-led and sustainable clean energy solutions.It operates across the renewable energy sector, with capabilities spanning solar module and cell manufacturing, Independent Power Production (IPP), EPC, and operations and maintenance (O&M), along with a growing presence across India. The company is expanding its manufacturing capabilities across ingots, wafers, solar cells and modules, with an ambition to build an integrated and globally competitive solar manufacturing platform and deepen integration across the solar value chain. Through deeper vertical integration, Agastya Energy aims to enhance domestic value addition, strengthen supply-chain resilience and support the development of India’s renewable energy ecosystem. With a focus on technology, operational excellence and sustainable development, the company is committed to strengthening India’s domestic renewable energy capabilities and supporting the country’s transition towards a cleaner, more resilient and self-reliant energy future.For anything media related, please contact:Chhavi SharmaAdfactors PRChhavi.sharma@adfactorspr.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *