మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మంగళవారం:
విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో పెద్ద కొడప్గల్ మండలం జడ్పీహెచ్ఎస్ కాటేపల్లి పాఠశాలలో పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని సాబ్లె నందిని తరఫున ఆమె తల్లి జేవంతి మధుసింగ్కు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లప్ప పటేల్ రూ.11,000 విలువైన చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..విద్యార్థుల విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. నందిని తల్లి జేవంతి మధుసింగ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.అనంతరం జడ్పీహెచ్ఎస్ కాటేపల్లి పాఠశాల పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఇంచార్జి విద్యాధికారి ప్రవీణ్ కుమార్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.విద్యార్థులను ప్రోత్సహించడం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషిని గౌరవించడం వల్ల విద్యారంగం మరింత అభివృద్ధి చెందుతుందని మల్లప్ప పటేల్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీ. యాదవ్, మూడ్ శంకర్, ఆర్. లలిత, వి. సునీత, ఎం. సుజాత, ఎం. భక్షిరామ్, జి. మంజుల, పి. అశోక్, దేవదాస్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
