మన ధ్యాస,నిజాంసాగర్ , జుక్కల్ గత నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాలైన పెద్దగుట్ట, గండిపేట్,ఎల్లుట్ల, వెల్లుట్లపేట తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో సింగితం ప్రాజెక్టులోకి 663 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.శుక్రవారం సింగితం ప్రాజెక్టు నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ ప్రవీణ్‌కుమార్ కొబ్బరికాయ కొట్టిన అనంతరం మూడు వరద గేట్లను ఎత్తి నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేశారు.ప్రస్తుతం సింగితం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 416.050 మీటర్ల మేర నీరు నిల్వ ఉందని ఆయన తెలిపారు.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న 663 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను మూడు గేట్ల ద్వారా ప్రధాన కాలువలోకి మళ్లిస్తున్నామని వెల్లడించారు.ఆయకట్టు రైతులు సాగునీటిని పొదుపుగా వినియోగించి ప్రతి ఎకరాకు ప్రయోజనం చేకూరేలా చూసుకోవాలని డిప్యూటీ ఈఈ సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఈలు అక్షయ్‌కుమార్, సాకేత్, వర్క్ ఇన్‌స్పెక్టర్ కాశినాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *