స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో నిరసన ర్యాలీ
మన ధ్యాస తిరుపతి ప్రతినిధి ప్రకాష్ బచ్చు :- విద్యార్థులు యువత భవిష్యత్తును అంధకారం చేసిన కూటమి ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ, డీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు తిరుపతిలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
వైఎస్సార్సీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు,తిరుపతి నియోజకవర్గం అధ్యక్షులు మల్లం రవిచంద్ర రెడ్డి.తిరుపతి అసెంబ్లీ బూత్ కమిటీ ఇంచార్జీ సాయి కుమారి,
ఉమ్మడి చిత్తూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఉదయ్ వంశీ, 37 వ వార్డు అధ్యక్షులు డేరంగుల బాలాజీ,రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మల్లం రవికుమార్, నగర యువజన విభాగం అధ్యక్షుడు దినేష్ రాయల్, నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు స్వరూప్, స్టేట్ జనరల్ సెక్రటరీ ఓబుల్ రెడ్డి, స్టేట్ యూత్ సెక్రటరీ నరేష్, నగర యువజన అధ్యక్షుడు చంద్రగిరి భాస్కర్, స్టేట్ సెక్రటరీ శశి తదితర నాయకులు పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొని, “డీఎస్సీ పేపర్ లీక్‌కు బాధ్యత వహించి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి” అంటూ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరని నాయకులు హెచ్చరించారు.విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, ప్రభుత్వం తన వైఫల్యాలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు.

