మన న్యూస్:టిడిపి నాయకులు లక్కమనేని మధుబాబు లక్ష రూపాయలు చెల్లించి టిడిపి పార్టీ శాశ్వత సభ్యత్వం స్వీకరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 22 వార్డు పరిధిలో లక్కమనేని మధుబాబు ఆధ్వర్యంలో వెలంపాళెం వద్ద పండుగ వాతావరణంలో శుక్రవారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్కమనేని మధు రూ. లక్ష చెల్లించి శాశ్వత సభ్యత్వాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా సభ్యత్వ రశీదును అందుకుని ఆదర్శంగా నిలిచారు. అనంతరం మధుబాబు పనితీరు, సేవాభావాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ముక్కుసూటి గా తన అభిప్రాయాలను వ్యక్తపరచడం మధుకు అలవాటని చెప్పారు. వైసీపీలో ఉంటూ ఆ పార్టీ అరాచకాలు జీర్ణించుకోలేక టిడిపిలో చేరారని తెలిపారు. ఆదర్శ భావాలతో నిండిన తెలుగుదేశం పార్టీలో ఈరోజు శాశ్వత సభ్యత్వం తీసుకుని ఆదర్శంగా నిలిచారని చెప్పారు. మధుబాబు చేస్తున్న సేవలకు గుర్తింపుగా సమచితస్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇతర పార్టీల నుంచి పలువురు పెద్ద ఎత్తున మధుబాబు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. వారందరినీ ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేని పూలమాలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగనేని చెంచయ్య నాయుడు, టిడిపి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు, మాజీ కౌన్సిలర్లు , రవీంద్రబాబు, ఇందిరా పవర్, మహబూబ్ బాషా, టిడిపి సాంస్కృతిక రాష్ట్ర కార్యనిర్వకులు నెమలూరు బుజ్జి, వజ్రం కిషోర్, జనసేన యువ నాయకులు మాధవ మహేష్ ,టిడిపి యువ నాయకులు సాలపాక్షి నవీన్, సోము, పవన్, గిరి, దశరథ, మదన్ నాయుడు, ఐ టి డి పి నియోజకవర్గ బాధ్యులు ఖాదర్, బాలాజీ రెడ్డి, ప్రవీణ్, 22వ వార్డు ప్రజలు, యల్లంపాలెం యువత, తదితరులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *