మన ధ్యాస ,( జుక్కల్ ) జూలై 24: పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సతీమణి తోట అర్చన, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన గృహాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ గృహ లబ్ధిదారులను అభినందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,స్థానిక సర్పంచ్ కుమ్మరి శేఖర్, నాయకులు తదితరులు ఉన్నారు