మన ధ్యాస, నెల్లూరు, జూలై 18 : నెల్లూరు నగరం,కరెంట్ ఆఫీస్ సెంటర్, మినిస్టర్స్ కేఫ్ ఎదురుగా శనివారం సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ….. సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు, గూడూరు, నాయుడుపేట మధ్యలో 50 ఎకరాల మెగా ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది అని అన్నారు. వాటికి అన్ని అనుమతులు వచ్చాయి. ఆ శుభ సందర్భముగా సన్రైజ్ సిబ్బందికి, ప్రజలకు,నగర పుర ప్రముఖులకు 2000 మందికి అన్నదానం చేస్తున్నాము అని అన్నారు. సన్రైజ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు 20 ప్రాజెక్టులు నిర్వహించి దిగ్విజయంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా చేస్తున్న ప్రాజెక్టు ఇది. చెన్నై, బెంగళూరు,ముత్తుకూరు, గూడూరు నాయుడుపేట మధ్యలో ఉన్న హైవే పక్కన 50 ఎకరాల మెగా ప్రాజెక్ట్ చేయడం జరిగింది.తక్కువ రేటుకి ప్లాట్లు అన్ని సౌకర్యాలతో ఇస్తున్నాము అని తెలిపారు.ఈ అవకాశాన్ని టీం లీడర్స్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెల్లూరు జిల్లాలో మరిన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం అని మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి అని తెలిపారు. సన్రైజ్ వారి సేవ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు అందించబోతున్నామని అని తెలియజేశారు. నెల్లూరు జిల్లా ప్రజలు సన్రైజ్ వారి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో సన్రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ పి. అంజిరెడ్డి, ఎంవి శివారెడ్డి, లక్ పతి, కార్తీక్, రవీంద్రారెడ్డి, బిజినెస్ డైరెక్టర్స్ ఎస్. శ్రీనివాసరావు,యు శ్రీనివాసులు, వై దేవకుమార్ రెడ్డి,శివన్న టీం లీడర్స్,ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




