మన ధ్యాస,నెల్లూరు, జులై 14 నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి 60వ జన్మదిన వేడుకలు స్థానిక హరనాధపురంలోని ఆయన స్వగృహం నందు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులు మరియు విబిఆర్ అభిమానుల మధ్య కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు రక్తదాన శిబిరాలను నిర్వహించగా, మరికొందరు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి,వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని స్థానిక 9వ డివిజన్ కార్పొరేటర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి పూల బొకేలు అందజేసి, శాలువాలు కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజశేఖర్ మాట్లాడుతూ….. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మృదు స్వభావంతో, నవ్వుతూ సమాధానం చెప్పే మంచి మనసున్న మహారాజు అని ఆయన సామాజిక సేవలను ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ సూచనలు సలహాలు, ఆదేశానుసారం నారాయణ విద్యాసంస్థల అభివృద్ధి సంక్షేమంతో పాటు, నగర అభివృద్ధి సంక్షేమానికి ఎంతో చేయూత అందిస్తున్నారని విజయ్ భాస్కర్ రెడ్డి సామాజిక రాజకీయ సేవలను కొనియాడారు. నేడు ఆయన జన్మదిన వేడుకలలో పాల్గొని ఆయనను సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు కార్పొరేటర్లు, డివిజన్ల ఇన్చార్జిలు, మహిళా శక్తి క్లస్టర్ ఇన్చార్జిలు, విజయ భాస్కర్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *