కలిగిరి జూలై 14 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

స్థానిక కలిగిరి లో నిర్మాణంలో ఉన్న నూతన శివాలయానికి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి రూ 2.00,116 విరాళాన్ని ప్రకటించారు. కలిగిరి జడ్పిటిసి పాలూరి మాల్యాద్రి రెడ్డి విజ్ఞప్తి మేరకు ఆలయ నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి తన వంతు సహాయంగా ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి సమాజంలో ఐక్యత, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తుందని ఆయన అన్నారు. ప్రజల సకాహారముతో శివాలయ నిర్మాణం త్వరగా పూర్తయి భక్తులకు అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక సేవలో ముందుండే నాయకుడిగా పేరుగాంచిన చేజర్ల సుబ్బారెడ్డి విద్యా వైద్యం పేదల సంక్షేమంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా నిరంతరం చేయు తందిస్తున్నారని స్థానికులు పోనియారాడు. శివాలయ నిర్మాణానికి ఆయన ప్రకటించిన విరాళం భక్తి సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలిగిరి జడ్పిటిసి పాలూరి మాల్యాద్రి రెడ్డి, గణపం రమేష్, బాలి బోయిన శ్రీనివాస్ యాదవ్, చేజర్ల సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *