వింజమూరు , జూన్ 27, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.


వింజమూరు మండలం చాకలకొండ గ్రామానికి చెందిన కాకర్ల మాల్యాద్రి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లినేని వెంకట రామారావు , వారి తనయుడు టిడిపి యువనేత బొల్లినేని కార్తీక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికి ఆత్మీయంగా ఆహ్వానించారు. అనంతరం బొల్లినేని వెంకట రామారావు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కాకర్ల మాల్యాద్రి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన గృహంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *