కొండాపురం జూన్ 27 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు…

ఉదయగిరి నియోజకవర్గం కొమ్మి హరిజనవాడలో శ్రీ సీతాలమ్మ బొడ్డురాయి ప్రతిష్ట కార్యక్రమానికి కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత , కొండాపురం మండలం మాజీ మండల అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రినాయుడు కుటుంబ సమేతంగా పాల్గొని హోమం, కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం రాములవారు స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్ధించారు. ముఖ్యంగా కొండాపురం మండలంలోని కొమ్మి గ్రామంలో హరిజనవాడ గ్రామస్తులకు ఆ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆ భగవంతుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి , కోడె వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ , టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య, చెరుకూరి శేషయ్య , చెరుకూరి వెంకయ్య,అంబటి సుబ్బారావు, డీ కే ఎమ్ చౌదరి,మాజీ సర్పంచ్ చెన్నయ్య,డీలర్ శ్రీను, మల్లికార్జున,వెంకటేశ్వర్లు , నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *