మన ధ్యాస, నెల్లూరు,జూన్ 25నెల్లూరు జిల్లా ఐసిడిఎస్ పిడి బి.హేన సుజన్ ఆదేశాల మేరకు బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా గురువారం మహిళలు మరియు పిల్లలలో ఆత్మహత్యలు నివారణ అనే అంశం మీద అవగాహన కార్యక్రమమును ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ నందు గల కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీ నందు విద్యార్థినీ విద్యార్థులకు ఈ అవగాహన కార్యక్రమంలో జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ విద్యార్థులు 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం జరిగింది.విద్యార్థులకు మహిళలు మరియు బాలికలపై హింస, వేధింపులు, బాలల రక్షణ, ఆత్మహత్యల నివారణ మరియు అత్యవసర సహాయ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు మహిళల భద్రత, బాలల హక్కులు, లైంగిక వేధింపుల నివారణ, సైబర్ భద్రత, మానసిక ఆరోగ్యం మరియు ఆత్మహత్యల నివారణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ అవసరమైన సమయంలో సహాయం పొందాలని సూచించారు.అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే మహిళా హెల్ప్‌లైన్ – 181, చైల్డ్ హెల్ప్‌లైన్ – 1098,–14416 మానసిక ఆరోగ్య సహాయక నంబర్ల గురించి వివరించారు. అలాగే మానసిక సమస్యలు, కుటుంబ సమస్యలు లేదా వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైనప్పుడు కౌన్సిలింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమమునకు సఖి వన్ స్టాప్ సెంటర్ నుండి కేస్ వర్కర్స్ జి. సాధన, పి. శారద పాల్గొని విద్యార్థినీ, విద్యార్థులకు సఖి వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలు, చట్టపరమైన సహాయం, వైద్య సహాయం, మానసిక కౌన్సిలింగ్. అత్యవసర రక్షణ సేవల గురించి సమగ్రంగా వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఆసక్తిగా సందేహాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. మహిళలు మరియు బాలల భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వివరించడం జరిగింది. తదుపరి బాల్య వివాహ నిర్ములన ప్రతిజ్ఞ చెప్పించడం జరిగింది.”ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు – సహాయం కోరడం ధైర్యం. మహిళలు, బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య కాలేజీ ప్రిన్సిపాల్, డి. రమణయ్య.మరియు వైస్ ప్రిన్సిపాల్ ఎ. రవి కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *