దువ్వూరి వారి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కలిగిరి మండల అధ్యక్షుడు పూసాల వెంగమ నాయుడు, మరియు టీడీపీ సీనియర్ నాయకులు చీమల తాతయ్య, ప్రధాన కార్యదర్శి కొప్పోలు కొండలరావు, మాజీ ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, రావులకొల్లు సర్పంచ్ పాములూరి వరప్రసాద్, పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు..!

కలిగిరి,పోలంపాడు,గురువారం జూన్ 25, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు..

కలిగిరి మండలం, పొలంపాడు గ్రామం SC మాదిగ పాలెం లో దువ్వూరి బాలయ్య- రమణమ్మ దంపతుల కుమారుడు చి॥ ఏడుకొండలు – చి॥ల॥సౌ॥ కవిత వివాహ మహోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న కలిగిరి మండల టిడిపి అధ్యక్షుడు పూసాల వెంగప నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు సీమల తాతయ్య, ప్రధాన కార్యదర్శి కొప్పులు కొండలరావు, మాజీ ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, రావులకొల్లు సర్పంచ్ పాములూరి వరప్రసాద్, పాల్గొన్నారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కాకర్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా పదివేల (10,000) రూపాయలు పెళ్ళికానుక అందజేశారు.అంగరంగ వైభవంగా, ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ శుభకార్యాన్ని మరింత వైభవంగా మార్చారు.వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాభివృద్ధులతో నిండిపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలిగిరి మండల టిడిపి ఆర్గనైజింగ్ సెక్రెటరీ కర్రా నాగరాజు, పోలంపాడు గ్రామ టిడిపి ఉపాధ్యక్షులు ఉన్నిమద్దెల తిరుపాలు, మరియు బంధు మిత్రులు తదితరులు పాల్గొనీ నూతన వధూవరులను ఆశీర్వదించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *