జలదంకి, జూన్ 24, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

జలదంకి మండలం జమ్మలపాలెంలోని కేవీఆర్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో జలదంకి మండల టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జ్ శ్రీ పూనూరు భాస్కర్ రెడ్డి కుమారుడు చి. సాయి రూపేష్ కుమార్ రెడ్డి మరియు చి.ల.సౌ. కావ్య శ్రీ వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకట రామారావు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *