కలిగిరి జూన్ 21 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు…

కలిగిరి మండలంలోని నూతన సర్కిల్ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జలదంకి కొండాపురం కలిగిరి వింజమూరు వరికుంటపాడు మండలాలకు చెందిన కన్వీనర్లు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు ఈ సందర్భంగా కలిగిరి మండల కన్వీనర్ పోసాల రంగమ నాయుడు డి.ఎస్.పి , వివి రమణ కుమార్ ను మరియు సిఐపి సుబ్బారావు సార్వాతో సత్కరించి పూలగుచ్చం అందజేశారు. అనంతరం ఐదు మండలాలకు చెందిన ఎస్ఐలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని, సర్కిల్ కార్యాలయం ప్రారంభంతో ప్రజలకు సేవలు మరింత చేరువు అవుతాయని ఆయన తెలిపారు. తదుపరి మండల కన్వీనర్ వెంగప నాయుడు మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రజా సేవలో చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల టిడిపి కన్వీనర్లు పోలీస్ శాఖ అధికారులు మండల ఉపాధ్యక్షులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *