మన ధ్యాస, నెల్లూరు, జూన్ 13 : నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్ అన్లిమిటెడ్ షాప్ ఎదురుగా శనివారం కోరా షూ మేకర్స్ షోరూం ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు గిరిధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి భవిష్యత్తులో మరెన్నో బ్రాంచులను స్థాపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరా చైర్మన్ చలపతిరావు ఆయన సతీమణి విజయ, కోరా ఎం.డి. రమేష్ లు మాట్లాడుతూ…. నెల్లూరు నగర ప్రజలను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పుట్ వేర్, లెదర్ ఉత్పత్తులను అందజేస్తున్నామన్నారు . ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తాము 20 బ్రాంచ్ లను ఏర్పాటు చేశామని 21వ బ్రాంచ్ ను నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరు నగర ప్రజలకు చెప్పులు, బూట్లు, బెల్టులు లెదర్ ఉత్పత్తులను అది తక్కువ ధరలకు అందించాలన్నదే తమ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కుంచి గోపికృష్ణ, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *