- గోవా కల్చర్ కాదు – ప్రశాంతమైన విశాఖ కావాలి
- పర్యాటకం పేరుతో యువత భవిష్యత్తుతో చెలగాటం వద్దు!
- ఐద్వా

మన ద్యాస ప్రతినిధి విశాఖపట్నం ఆర్ కె బీచ్ జూన్ 13:విశాఖపట్నం సముద్ర తీరంలో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చే ప్రభుత్వ బీచ్ షాక్ నిర్ణయాన్ని నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఆర్.కె.బీచ్ కాళీమాత ఆలయం వద్ద శనివారం నిరసన ర్యాలీ జరిగింది.ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులుB .ప్రభావతి,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్.ఎన్.మాధవి,యు.సత్యవతి,జిల్లా ఉపాధ్యక్షురాలు బి.పద్మ మాట్లాడుతూ గోవా కల్చర్ పేరుతో బీచ్లలో మద్యం అమ్మకాలకు అనుమతులివ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం తన ఖజానా నింపుకోవడానికి,మద్యం సిండికేట్లకు లబ్ధి చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు.కుటుంబాలు, మహిళలు,పిల్లలు ప్రశాంతత కోసం వచ్చే విశాఖ బీచ్లో మద్యం అందుబాటులోకి వస్తే మహిళల రక్షణ గాల్లో కలిసిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే సమాజంలో మద్యం, మత్తు పదార్థాల వల్ల గృహ హింస, ఆర్థిక సంక్షోభం పెరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని,పిల్లల చదువులు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలో పెరుగుతున్న గంజాయి,డ్రగ్స్ సంస్కృతికి తోడు ఈ నిర్ణయం యువతను మరింత నిర్వీర్యం చేస్తుందని.సముద్ర తీరం ప్లాస్టిక్ వ్యర్థాలు,మద్యం సీసాలతో నిండి పర్యావరణం పూర్తిగా ధ్వంసమవుతుందని హెచ్చరించారు.ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మహిళలు, యువతను ఏకం చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఐద్వా స్పష్టం చేసింది.
ఐద్వా ముఖ్య డిమాండ్లు:బీచ్ షాక్ తక్షణమే రద్దు చేయాలి:విశాఖ బీచ్ తో సహా రాష్ట్రం లో ఏ బీచ్ బీచ్ పరిసరాల్లో మద్యం అమ్మకాలు చేయకూడదు.విశాఖ నగరంలో అక్రమ మద్యం అమ్మకాలను,బెల్ట్ షాపులను, గంజాయి మరియు డ్రగ్స్ రవాణాను కఠినంగా అణచివేయాలి.మహిళల,యువత రక్షణను పటిష్టం చేయాలి.నగరంలో శాంతిభద్రతలను కాపాడుతూ, మద్యం మహమ్మారి నుండి కుటుంబాల భవిష్యత్తును రక్షించాలి.పర్యావరణాన్ని కాపాడాలి.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఆఫీస్ బేరర్స్ D.కొండమ్మ,R.వరలక్ష్మి, CH.సుమిత్ర, B.రమణి, V.ప్రభావతి,K.కుమారి, D.రమణమ్మ,మౌనిక,అరుణ,B.సత్యవతి,మంగవేణి, దేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు BL నారాయణ, కృష్ణ మెటర్నిటీ హాస్పిటల్ స్టాఫ్,పెద్ద సంఖ్య లో మహిళలు పాల్గొన్నారు.