

మన న్యూస్: కర్మన్ ఘాట్.సంకటహర చతుర్థి సందర్భంగా మంగళవారం చంపాపేట డివి జన్ శ్రీ కర్మన్ ఘాట్ధ్యా నాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో సంకటహర చతుర్థిని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కార్యని ర్వాహణాధికారి ఎన్ లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు రాచర్ల చంద్రకాంత్ శర్మ,పవన్ కుమార్,అర్చకులు కందాల సంతో ష్ కుమార్,జి శ్రీనివాస్ సకల సంకటాలను తోలగించేటటువంటి హోమం
సామూ హిక గణపతి హోమం నిర్వ హించి మూలవిరాట్ శ్రీ వరసిద్ది వినాయక స్వామికి ప్రాతఃకాల ప్రత్యేక పూజ కార్యక్ర మాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎం. వెంకటయ్య,జి రమాదేవి, టి.వేణు గోపాల్త దితర సిబ్బంది పాల్గొన్నారు.