జీవనాధారం కోల్పోయిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలి, ప్రభుత్వం ఆదుకోవాలి
సాలూరు మన ధ్యాస ప్రతినిధి:- పార్వతిపురం మన్యం జిల్లా సిపిఎం పాచిపెంట మండలం కూనం బంధవలస గ్రామానికి చెందిన గిరిజనులు చొక్కాపు పెంటయ్య మజ్జి సీతారాం లకు చెందిన రెండు పాడి ఆవులు కరెంటు స్తంభం పడి కరెంటు షాపు వలన రెండు పాడి ఆవులు మృతి చెందడం జీవనాధారం కోల్పోయారని వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రకృతి వైపరీత్యాలు కారణంగా మృతి చెందిన మూగజీవాలు వలన నష్టపోయిన వారికి పరిహారం అందించాలని అలాగే ఎన్నో ఆశలు పెంచుకొని ఆ పాడే ఆవుల వలన బతుకుతున్న గిరిజనులకు బ్రతుకు లేకుండా పోయే పరిస్థితి ప్రభుత్వం రుణాలు ఇచ్చి ఆవులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజనులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు . ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొ ర్ర శ్రీనివాసరావు పరిశీలించడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ అధికారులు ఇటువంటి ప్రమాదాలను ముందే గుర్తించే విధంగా ఎక్కడ కరెంటు స్తంభాలు బలహీనంగా ఉన్నాయో ఎక్కడా చెట్టు కొమ్మలకు తగిలి ఉన్నాయో అనేది పరిశీలన చేసి ప్రమాదాలు జరగకుండా నిత్య పర్యవేక్షణ చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని అన్నారు. మూగ జీవాలు చనిపోయిన సందర్భంలో కొద్ది క్షణాల్లో ముందే అక్కడ పొలాల్లో పని చేసినటువంటి గిరిజన మహిళలు గిరిజనులు ఊర్లోకి వెళ్లిపోవడం ప్రాణాప్రాయం తప్పిందని అన్నారు.జిల్లా అధికారులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో నిత్య పరిరక్షణ చేయాలని కోరారు.మృతి చెందిన పాడే ఆవులను పరిశీలిస్తున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కొర్ర శ్రీనివాసరావు, చాలా బాధాకరమని అన్నారు.