తవణంపల్లి మే 5 మన ద్యాస

విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం మేరకు తవణంపల్లి మండలం కట్టకింద పల్లి గ్రామానికి చెందిన గుర్రప్ప (55) అనే వ్యక్తి జయచంద్ర అనే వ్యక్తి యొక్క తోటలో రమేష్ అనే మరో వ్యక్తితో కలిసి మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు కోస్తూ ఉండగా విద్యుత్ తీగ తగిలి గుర్రప్ప చెట్టు పైనుండి కిందకు పడ్డాడు. పక్కనే మామిడికాయలు కోస్తున్న రమేష్ అనే వ్యక్తి కూడా చెట్టుపైనుండి కిందపడ్డాడు. క్షతగాత్రులు ఇద్దరినీ స్థానికులు అరగొండ అపోలో ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యమంలో గుర్రప్ప మృతి చెందినట్లు అపోలో వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన పైన గుర్రప్ప భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తవణంపల్లి ఎస్సై రమేష్ బాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *