ఏర్పేడు జూన్ 1

మండల పరిధిలోని పలు పంచాయతీలలో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అర్హులైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి నాయకులు స్వయంగా పింఛన్ నగదును అందజేశారు.

​ఏర్పేడు మండలంలోని సీతారామపేట, ఆమందురు, ఏర్పేడు, మనసముద్రం, మరియు దుగ్గిపేరి పంచాయతీలలో నిర్వహించిన ఈ పంపిణీ కార్యక్రమాల్లో ఏర్పేడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ముఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు గాలి కృష్ణవేణి, గుణా యాదవ్, కే.కే. రమణ, రాచాటి సుబ్రమణ్యం, వై. మనోహర్ నాయుడు మరియు ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు మాట్లాడుతూ… వృద్ధులు, వికలాంగులు, వితంతువుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందిస్తోందని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరుగుతోందని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ ముందుంటాయని ఆయన స్పష్టం చేశారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వంపై మరియు స్థానిక నాయకత్వంపై హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed