​రేణిగుంట:
తిరుపతి జిల్లా రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా జన్మదినం సందర్భంగా ఎమ్మే జబ్బార్ ట్రస్ట్ అధినేత డాక్టర్ షేక్. ఫరీద్ బాబా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
​ఈ సందర్భంగా రేణిగుంట గడ్డపై చిరునవ్వుల సారథిగా పేరొందిన మహబూబ్ బాషా జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఎమ్మే జబ్బార్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ షేక్ ఫరీద్ బాబా మాట్లాడుతూ.. మండలంలో వార్డు మెంబర్ స్థాయి నుంచి నిలకడగా ఎదుగుతూ నేడు రేణిగుంట పట్టణ అధ్యక్షుడిగా గుర్తింపు తెచ్చుకోవడం మహబూబ్ బాషా నిరంతర కష్టానికి, నిబద్ధతకు దక్కిన ఫలితమని కొనియాడారు. రేణిగుంట పట్టణ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు.
​పార్టీ తీవ్ర కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అధైర్యపడకుండా, రేణిగుంటలోని ప్రతి వాడవాడలా తిరిగి, కార్యకర్తలను ఐక్యం చేస్తూ పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కాలం నుండి, నేటి యువనేత బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వం వరకు దాదాపు 20 సంవత్సరాలుగా ఎన్ని రాజకీయ పరిణామాలు ఎదురైనా, ఆటుపోట్లను తట్టుకుంటూ పసుపు జెండా నీడలోనే కొనసాగారని, ఆయన ఆ జాతికే ఒక ఆణిముత్యం లాంటి వారని పేర్కొన్నారు. నిరంతరం పార్టీని అంటిపెట్టుకుని శ్రమించిన ఆయన సేవలను మరియు చేసిన త్యాగాలను అధిష్ఠానం గుర్తించిందని, అందుకే ఈరోజు రేణిగుంట పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలను అప్పగించిందని తెలిపారు. ఈ పదవి ఆయన కష్టానికి దక్కిన నిజమైన గౌరవమని అన్నారు.
​మహబూబ్ బాషాకు ఎల్లప్పుడూ చిరునవ్వుే ఒక ఆభరణమని, సమస్య ఎవరిదైనా సరే, పార్టీలకతీతంగా “బాషా” అని పిలవగానే స్పందించి, తనకు సాధ్యమైనంత వరకు పనిచేసి సమస్యను పరిష్కరించే గుణం ఆయన సొంతమని కొనియాడారు.
​ఈ శుభసందర్భంగా కలియుగ వైకుంఠుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీర్వాదాలు మహబూబ్ బాషాకు ఎల్లవేళలా ఉండాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మహబూబ్ బాషా మరిన్ని ఉన్నత పదవులను అలంకరించి, ప్రజలకు మరింతగా సేవ చేయాలని కోరుకుంటూ డాక్టర్ షేక్ ఫరీద్ బాబా మరోసారి తన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed