​మహానాడు పండుగలో భాగంగా తొట్టంబేడు మండలంలోని 11, 12 క్లస్టర్ల పరిధిలో నిర్వహించిన వర్చువల్ వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సందడి చేశారు. అంతకుముందు యుగపురుషుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సభా ప్రాంగణంలో కార్యకర్తలతో కలిసి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.

​టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన దిశా నిర్దేశక ప్రసంగం పార్టీ కేడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది మహానాడు ప్రధాన థీమ్‌గా ‘స్త్రీ శక్తి’ని ఎంచుకోవడం విశేషమన్నారు. అలాగే యువనేత నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మహానాడు కావడం వల్ల నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొందని వివరించారు. కూటమి ప్రభుత్వ ప్రజా రక్షణ పాలనలో పసుపు జెండాను మరింత ఎత్తుకు ఎగరేస్తూ, శ్రీకాళహస్తి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *