తవణంపల్లి మే 27 మనద్యాస ప్రతినిధి (నాగరాజ సరకింటి)
తవణంపల్లి మండలం, ఐరాల క్రాస్ సి డి ఎం కళ్యాణ మండపంలో పసుపు పండగ మహానాడు మహోత్సవం కార్యక్రమంలో భాగంగా క్లస్టర్-6 పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 27, బుధవారం సిడియం కళ్యాణ మండలం వేదికగా తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు మహోత్సవం ఘనంగా జరుపుకున్నారు పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు మురళీమోహన్ మార్గదర్శకత్వంలో, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేష్ చౌదరి అధ్యక్షతన, క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ నాయుడు సమర్థ పర్యవేక్షణలో ఈ మహత్తర కార్యక్రమం పండగ వాతావరణం లో క్లస్టర్-6 పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు పండుగ మహానాడును అఖండ విజయవంతం జరుపుకున్నారు లైవ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అనుసరించు విధానములను లైవ్ లో కార్యకర్తలు చూడడం జరిగింది అదేవిధంగా తవణంపల్లి మండలం క్లస్టర్ 5 గాజులపల్లి వేదికగా పసుపుపండగ మహానాడువిజయవంతంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో తవణంపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుర్రం వెంకట్ చౌదరి, క్లస్టర్ ఇంచార్జ్ ప్రవీణ్ ఎన్ పి ఎస్ ఎస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రంజిత్ రెడ్డి ,అర్ధగిరి చైర్మన్ ఏ రఘుపతి, కమిటీ సభ్యులు బూత్ ఇన్చార్జిలు కే ఎస్ ఎస్ సభ్యులు పార్టీ నామినేట్ పదవుల్లో ఉన్న నాయకులు గాలి దిలీప్ వినాయక,గోపి, వేణుగోపాల్ నాయుడు, మండల నాయకులు మరియు అభిమానులు మండల నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు