మన ధ్యాస,నెల్లూరు. మే 21: భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని ఘనంగా నెల్లూరు,స్థానిక ఇందిరా భవన్ నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ….. దేశాన్ని కమ్యూనికేషన్ సాంకేతిక పురోభివృద్ధికై బాటలు వేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని, ఓటు వయసును 18 సంవత్సరాలకు తగ్గించి, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు దేశం కోసం నిస్వార్ధంగా పాటుపడిన రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతిలో దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అని కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ప్రధాని విదేశాలలో జోకర్ లాగా కార్టూన్లు వేస్తున్నారని వాపోయారు. జిల్లాలో మద్యం ఏరులై పారుతుందని మద్యం మీద నెలకు 8 కోట్ల దోపిడీ జరుగుతుందని, పాలకులు అధికారుల మీద మద్యం టార్గెట్లు విధించి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు, కృష్ణ నికర జలాలు లో నెల్లూరు రైతుల వాటా సున్నా అని ఈ విషయమై వైసీపీ నోరు మెదపడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షుడు ఇర్ఫాన్, జిల్లా ఉపాధ్యక్షుడు బాల సుధాకర్, ప్రధాన కార్యదర్శి కే సంజయ్ కుమార్, మైనార్టీ నాయకులు అల్లావుద్దీన్, మలి కిషోర్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి,బద్రి,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
