కర్మన్ ఘాట్ :-

రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కర్మన్ ఘాట్ క్రాంతి నగర్ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు వీధి వ్యాపారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన కరపత్రాలను పంపిణీ చేసి, కుటుంబ సమేతంగా సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నాయకులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని తెలిపారు. రాబోయే ఈ భారీ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే చంపాపేట్ డివిజన్ నుంచి భారీ జన సమీకరణ లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి చంపపేట్ డివిజన్ అధ్యక్షులు పో రెడ్డి రవీందర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు సద్ది సందీప్ రెడ్డి, లింగాల దశరథ గౌడ్, లంకల రమేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, మల్లేష్ , కాంతి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు జెనార్దన్, మితిలేష్, బలరాంరెడ్డి, అమర్, బీరప్ప, సత్తయ్య, మహేందర్ సింగ్, పని శర్మ, సుబ్బారావు, రాజిరెడ్డి, రామకృష్ణ, సత్యనారాయణ, బ్రాహ్మచారి, జంగచారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *