మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సి మునీశ్వర్ రెడ్డి.

చిత్తూరు, మనధ్యాస, మే5

రిపోర్టర్:కమల్

సోమవారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో కురిసిన అకాల భారీ వర్షాలు ,ఈదురు గాలులకు జిల్లాలోని అనేక మండలాల్లో మామిడి కాయలతో పాటు ఇతర ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిని నేల పాలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన మామిడి ఇతర ఉద్యాన పంటలకు అకాల భారీ ఉక్కపోత వర్షాలు ఈదురు గాలుల కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయి సతమతమౌతున్నారు. ఈ సారి జిల్లాలో మామిడి కాయలు తీవ్రమైన ఎండల కారణంగా పంట అంతంత మాత్రమే ఉన్నా కాస్తోకూస్తో ఉన్న మామిడి కాయలు కూడా వర్షాల కారణంగా నేలపాలు కావడంతో రైతులు తీవ్రమైన నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రతి ఏటా మే నెలలో కురిసే అకాల వడగళ్ళు. భారీ వర్షాలు.బారీ ఈదురు గాలులకు వేసిన పంటలు పూర్తిగా నేల పాలై ప్రతి ఏటా నష్టపోతూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మామిడి రైతులకు పకృతి వైపరీత్యాల వలన సంభవించే అకాల భారీ వర్షాల కారణంగా నష్టపోతున్న మామిడి రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు.కావున కూటమి ప్రభుత్వమైనా స్పందించి ఈసారైనా మామిడి రైతులను ఆదుకుని.అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మామిడి.ఇతర ఉద్యాన పంటల రైతులను ఆదుకోవాలని మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సి మునీశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *