ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణవేణి…

రేణిగుంట మన ధ్యాస మే 5.
రేణిగుంట మండలం కరకంబాడిలోని రాస్ కార్యాలయంలో కిశోరి వికాసం కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది. రేణిగుంట ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణవేణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కౌమార దశలోని బాలబాలికలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
​ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారిణి మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో పిల్లల అభివృద్ధిని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా చదువు యొక్క ప్రాముఖ్యత, పోక్సో చట్టం ద్వారా బాలల రక్షణ, బాల్య వివాహాల నివారణ, పౌష్టికాహారం, పరిశుభ్రత మరియు జీవన నైపుణ్యాల వంటి అంశాలపై దశలవారీగా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. సెలవుల్లో లభించే ఈ సమయాన్ని పిల్లలు సద్వినియోగం చేసుకొని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను గ్రామాల్లోని తోటి బాలబాలికలకు వివరించాలని ఆమె సూచించారు.
​ముందుముందు ప్రతి మంగళవారం గ్రామ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు హేమావతి, అనంతలక్ష్మి, సమన్వయకర్తలు నాగేంద్ర, భారతి, అంగన్వాడీ కార్యకర్తలు పెంచలమ్మ, రజిని మరియు సుమారు 60 మంది కిశోర బాలబాలికలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *